- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలకు రెక్కలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లగ్జరీ నివాస మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం..నగరంలో 498 చదరపు మీటర్ల విస్తీర్ణం గల లగ్జరీ ఇల్లు కొనాలంటే ప్రస్తుతం మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.50 కోట్లు) కావాలి. గత ఏడాది 503 చదరపు మీటర్లు వచ్చేది. అంటే స్థలం లభ్యత ఒక శాతం తగ్గింది. రూపాయి విలువ క్షీణించినప్పటికీ ఇంటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. దేశంలోని మొత్తం అత్యంత సంపన్న వ్యక్తుల్లో 6.3 శాతం మంది హైదరాబాద్ లోనే ఉన్నారు.

